Anurag Thakur: తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైంది
Anurag Thakur: హుజూరాబాద్‌లో బీజేపీ సర్జికల్ స్ట్రైక్ తర్వాత.. కేసీఆర్‌లో వణుకు మొదలయ్యింది
Anurag Thakur: తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైంది
Anurag Thakur: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బీజేపీ జాతీయ నేతలు విరుచుకుపడుతున్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ సర్జికల్ స్ట్రైక్ తర్వాత కేసీఆర్‌లో వణుకు మొదలయ్యిందన్నారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. ఎన్నికల వచ్చినప్పుడల్లా సర్జికల్ స్ట్రైక్‌పై ప్రశ్నలు వేస్తున్నారని సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకే పాట పాడుతున్నాయని మండిపడుతున్నారు. భారత సైనికుల వీరత్వాన్ని ప్రశ్నించేలా కేసీఆర్ మాట్లాడడం శోచనీయమన్నారు అనురాగ్ ఠాకూర్. భారత సైనికులు ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశారనేది సత్యమని కేసీఆర్ పరిపాలన నుండి ప్రజలు త్వరగా విముక్తి పొందాలని కోరుకుటున్నానన్నారు అనురాగ్ ఠాకూర్.