ఆర్టీసీ కార్మికులు పట్టువీడారు.. సర్కార్ మెట్టుదిగేనా.. కేసీఆర్ కరుణించేనా..?

Update: 2019-11-21 04:16 GMT
Ashwathama Reddy

సుదీర్ఘంగా కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఓ కొలిక్కి వచ్చింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత అక్టోబర్ 4 అర్ధరాత్రి నుంచి దాదాపు 50వేల మంది కార్మికులు సమ్మెకు దిగారు. విధుల్లో చేరాలని ప్రభుత్వం రెండుసార్లు గడువు విధించినా కార్మికులు స్పందించలేదు. నెలన్నరకు పైగా జీతాలను ఫణంగా పెట్టి సమ్మె చేశారు. సమ్మె కాలంలో పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులు తమ సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామరెడ్డి కోరారు. సమ్మెకు పూర్వం ఉన్న వాతావరణం కల్పించాలన్నారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు.

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. పలుసార్లు సమీక్షలు నిర్వహించిన సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు.

హైకోర్టు ఉత్తర్వులు, మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె విరమణకు ఒప్పుకోవడంతో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకుంటుందా..? అన్నది ఉత్కంఠగా మారింది. 

Tags:    

Similar News