టీఎస్‌ ఐసెట్‌ 2019 షెడ్యూల్‌ విడుదల

Update: 2019-02-09 02:58 GMT

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించబోయే టీఎస్‌ ఐసెట్‌–2019 షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 21న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య టి.పాపిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మార్చి 7 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని. ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 450 రూపాయలు, ఇతరులు 650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

దరఖాస్తుల స్వీకరణ రిజిస్ట్రేషన్‌కు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్‌ 29 వరకు ఉంటుందని పేర్కొన్నారు. 500 రూపాయల అపరాధ రుసుముతో మే 6 వరకు, 2వేల రూపాయల అపరాధ రుసుముతో మే 11 వరకు, 5 వేల రూపాయల అపరాధ రుసుముతో మే 15 వరకు, 10 వేల అపరాధ రుసుముతో మే 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని పాపిరెడ్డి చెప్పారు. మే 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షలు మే 23, 24 తేదీల్లో 3 సెషన్లలో నిర్వహిస్తారని చెప్పారు. మే 9 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 29న ప్రిలిమినరీ కీ, జూన్‌ 13న ఫలితాలు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.  

Similar News