కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌పై టీఆర్ఎస్ నేత ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఫైర్ అయ్యారు.

Update: 2020-05-01 12:29 GMT
Revanth Reddy(File photo)

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ బావమరిది సైంటిస్టా అంటూ.. రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని మరి ఆయన సోదరులు నాసా నుంచి తిరిగొచ్చారా అంటూ విమర్శించారు. ఎదుటివారి కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసే ముందు రేవంత్ రెడ్డి తన కుటుంబం చేస్తోన్న మోసాలను గమనించాలని విమర్శించారు. గోల్కొండ ఫార్మా కెమికల్ కంపెనీలో మందులు తయారు చేస్తున్నారని, వారు సైంటిస్ట్‌లు అవుతారా అని ప్రశ్నించారు.

కరోనా వైరస్‌కు ఐఐసీటీ సిప్లాతో కలిసి మందు తెచ్చే ఒప్పందం చేసుకుందని, ఐఐసీటీ పరిశోధన సంస్థ అని, ఎన్నో విద్యాసంస్థలు, కంపెనీలతో పరిశోధన ఒప్పందాలు చేసుకుంటుందని గుర్తు చేశారు. రేవంత్ తీరు మోకాలికి బొడి గుండుకి ముడి పెట్టినట్టు ఉందని, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులకు దిగజారి రాజకీయాలు చేయడం సరైంది కాదని అని పేర్కొన్నారు.

Tags:    

Similar News