Teachers Transfers: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు
Teachers Transfers: 1-10 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒక టీచర్
Telangana DSC 2024 Counselling Postponed
Teachers Transfers: పాఠశాల విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు తెలంగాణ సర్కార్ రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 0 – 19 వరకు విద్యార్థులున్న పాఠశాలకు ఒకరు, 20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఇద్దరు, 61 నుంచి 90 వరకు విద్యార్థులున్న పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా గత ప్రభుత్వం 2015, జూన్, 27న జీవో నెంబర్ 17, 2021, ఆగస్టు 21న జీవో నెంబర్ 25 జారీ చేసింది.
అయితే విద్యార్థుల సంఖ్య, వారికి మెరుగైన విద్యా బోధనను దృష్ట్యా తాజాగా ఆయా పాఠశాలలకు పోస్టులకు కేటాయింపు చేయనున్నారు. 1-10 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒకటి, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న పాఠశాలకు రెండు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు మూడు, 61కి మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలకు ఆ పాఠశాలకు మంజూరైన అన్ని పోస్టులు భర్తీ చేసేలా వెబ్ ఆప్షన్ల కేటాయింపు ఇవ్వనట్లు సమాచారం.