హైదరాబాద్ చైతన్యపురి పీఎస్ పరిధిలోని గణేష్పూరి కాలనీలో ట్రాక్టర్ బీభీత్సం సృష్టించింది. డిస్మెంటల్ లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పింది. చిన్న సందులో ఉన్న రెండు కార్లు, ఐదు బైకులను ఢీకొంది. కుదుపుతో ట్రాక్టర్ డ్రైవర్ కిందపడిపోయి గాయపడ్డాడు. డ్రైవర్ లేకుండానే ట్రాక్టర్ కొంతదూరం ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటనతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై నిల్చున్న ఓ చిన్నోడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.