BJP: ఇవాళ తెలంగాణకు ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు.. ఈ నెల‌ 20 నుంచి 27 వరకు తెలంగాణలో మకాం

BJP: 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న 119 మంది ఎమ్మెల్యేలు

Update: 2023-08-19 03:49 GMT

BJP: ఇవాళ తెలంగాణకు ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు.. ఈ నెల‌ 20 నుంచి 27 వరకు తెలంగాణలో మకాం

BJP: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీబీజేపీ దూకుడు పెంచింది. ఇవాళ తెలంగాణకు ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు రానున్నారు. ఈ నెల‌ 20 నుంచి 27 వరకు తెలంగాణలోని నియోజకవర్గాల్లో యూపీ, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 119 మంది ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. నియోజకవర్గాల్లోని పరిస్థితులు, పార్టీ స్థితిగతులపై హైకమాండ్‌కు నివేదిక ఇవ్వనున్నారు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు. ఎన్నికల వరకు తరచూ తెలంగాణలో పర్యటించేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం.

Tags:    

Similar News