కొమురంభీం జిల్లాలో పులి కలకలం..

గత కొన్ని రోజులుగా కొమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది.

Update: 2020-05-07 12:24 GMT

గత కొన్ని రోజులుగా కొమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ప్రజలు అంతా ఇండ్లకు పరిమితమయ్యారు. దీంతో అడవిలో ఉండే పులి గ్రామాల్లోకి సంచరించడం మొదలుపెట్టింది. గత 15 రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో పులి తిరుగుతూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత శనివారం రోజున ఉదయం పెద్దపులి చిర్రకుంట గ్రామ సమీపంలో రోడ్డుపై ఫారెస్ట్‌ సిబ్బందికి కనిపించినట్టు సమాచారం.

అదే రోజు రాత్రికూడా పులి అదే ప్రాంతంలో సంచరిస్తుండగా అటవీ అధికారులు అప్రమత్తమయ్యారన తెలిపారు. మళ్లీ ఈ రోజు ఉదయం కైరిగూడ ఓసిసి సమీపంలో ఉన్న ఓ వాగును పులిదాటుండగా స్థానికులు గమనించి వారి ఫోన్లలో వీడియో తీసి అటవీ అధికారులకు సమాచారం అందించారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 21వ తేదీన కూడా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులకు పెద్దపులి కనిపించినట్లు వారు సమాచారం అందించారు. ఇక ఇప్పటికే కొమురంభీం జిల్లాల్లో తిరుగుతున్న పెద్దపులి రెండు ఆవులను చంపటంతో పశువులు, గొర్రెల కాపరులు బయటకు వెళ్లేందుకు వణుకుతున్నారు.

Tags:    

Similar News