ఉపాధి కోసం పట్టణాలనుంచి పల్లెల బాట పట్టిన ఆదిలాబాద్ కూలీలు
ఉపాధి కోసం పట్టణానికి వెళ్లి మరల పల్లే బాట పడుతున్న కార్మికులు ఆదిలాబాద్‌లో 20వేలమందిపైగా ఉపాధికోసం వలస పోతున్న కూలీలు ఓ పక్క ప్రకృతి విపత్తులు మరో పక్క కనుమరుగువుతున్న ఉపాది అవకాశాలు
ఉపాధి కోసం పట్టణాలనుంచి పల్లెల బాట పట్టిన ఆదిలాబాద్ కూలీలు
పల్లేసీమల్లో ఉపాది పనులు లేక పట్టణాలకు వలస వెళ్లిన కార్మికులకు మళ్లీ పల్లేసీమలే ఉపాదికల్పిస్తున్నాయి. పట్టణాల్లో స్థిరపడ్డ వ్యవసాయ కూలీలు మళ్లీ పల్లబాటపట్టారు. ఓ పక్క ప్రకృతి విపత్తులు మరో పక్క కనుమరుగువుతున్న ఉపాది అవకాశాల నేపథ్యంలో.. పట్టణాన్ని నమ్మకున్న కూలీలు మళ్లీ పల్లేల వైపే చూస్తున్నారు. గ్రామాల్లో కూలీల కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు.. అండగా నిలుస్తున్న వ్యవసాయ కూలీలపై ప్రత్యేక కథనం.
ఆదిలాబాద్ పట్టణంతో పాటు సరిహద్దు మహారాష్ట్రా గ్రామాల నుంచి.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20వేలమంది కూలీలు, ఉపాదికోసం వ్యవసాయ పనుల నిమిత్తం పల్లేలకు తరలివేళ్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్పగానే తెల్లబంగారం పంటగా పిలుచుకునే పత్తిపంటనే గుర్తుకువస్తుంది. అయితే 90 శాతానికిపైగా వ్యవసాయ ఆధార కుటుంబాలే ఉండటంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయమే వీరి జీవనాధారం. అయితే పత్తి ఉత్పత్తితో పాటు, 20 వేల కోట్ల రూపాయలకు పైగా సాగే పత్తి వ్యాపారం, ఆసియాఖండంలోనే రికార్డు స్థాయిలో పత్తి బేళ్ల ఉత్పత్తి జరిగే ఆదిలాబాద్కు కాటన్ టౌన్గా పేరుంది.
గత కొన్నేళ్లుగా పట్టణ ప్రాంతాలకు ఉపాది కోసం, వేలాది మంది కూలీలు కుటుంబ సమేతంగా,, జిల్లాలోని ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి వంటి ప్రాంతాలకు వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. మరి కొంత మంది కూలీలు మహారాష్ట్ర, చత్తీల్ ఘడ్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, మద్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి జిన్నింగ్ మిల్లులతో పాటు దారం మిల్లులు, ఆయిల్ మిల్లుల్లో కూలీ పనుల కోసం వచ్చి పొట్టపోసుకునే వారు.. ఇదంతా గతం.. ప్రస్తుతం అతివృష్టి కారణంగా జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకుని.. పంటలు పండక రైతులు పెద్దఎత్తున నష్టాలను మూటకట్టుకోగా, పంటదిగుబడులు లేక కూలీలకు కూడా పనులు దొరికే పరిస్తితి లేకుండా పోయింది.
అయితే కాటన్ టౌన్గా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా వందకు పైగా పత్తిమిల్లులు, 50కి పైగా నూనే మిల్లులు, 2 దారం మిల్లులు, 3 సోయాబీన్ సాల్వేంట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమలను నమ్ముకుని గతంలో పట్టణాలకు వసల వచ్చి.. పత్తి ఆధారిత పరిశ్రమల్లో కూలీచేస్తూ పొట్టపోసుకునే వారిని.. ఈ సారి వర్షాలు చిద్రం చేశాయి. గతంలో ప్రతినిత్యం వేలాదిక్వింటాళ్ల పత్తినిల్వల గంజీలతో కళకళలాడే జిన్నింగ్ మిల్లులు.. నేడు సరుకు రాక వెలవెలబొతున్నాయి. ఈ పరిశ్రమలను నమ్ముకుని వలస వచ్చిన కూలీలకు సైతం పనులు దొరికే పరిస్థితులు లేకుండా పోతున్నాయి.. పత్తి ఆధారిత పరిశ్రమలను నమ్ముకుని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 20వేల మంది కూలీలు ఉపాదిపొందుతున్నారు.
ఆదిలాబాద్ డివిజన్లోని తాంసి, తలమడగు, జైనథ్, బేలా మండలాల్లోని పలు గ్రామాలు పొలం పనులకు వెళ్లే వేలాది మంది కూలీలకు ఉపాదికల్పిస్తున్నాయి. అదే విధంగా మహారాష్ట్రాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వలస కూలీలు సైతం.. ఇక్కడి పల్లేల్లో కూలీపనుల కోసం రావడం జరుగుతోంది. ప్రస్తుతం పత్తిపంట రైతుల చేతికి అందుతుండటంతో కూలీలకు డిమాండ్ పెరిగిపోయింది. పత్తీతీతకు కేజీకి పది నుంచి పన్నేడు రూపాయల తీసుకుంటుండగా.. ఆటో చార్జీలు సైతం రైతు చెల్లించాల్సిన పరిస్థితి.. మరో పక్క పండిన పత్తిపంటకు మార్కెట్లో మద్దతు ధరలు దొరక్క రైతులు వాపోతున్నారు. మొత్తంగా కూలీల కొరత ఏర్పడటం, ఉన్నవారికి డిమాండ్ పెరగడంతో.. రైతులపై అదనపు భారంపడుతుండగా, వేలాది మంది కూలీలకు మాత్రం వ్యవసాయ పనుల ఉపాది కల్పిస్తున్నారు.