కొత్త తరహా దొంగలు.. పాల ప్యాకెట్లు చోరీ చేస్తున్న కిలాడీ భార్యాభర్తలు

Update: 2019-12-31 06:22 GMT
కొత్త తరహా దొంగలు

డబ్బు, బంగారం దొంగలను చూసుంటాం. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్త తరహా దొంగలు పుట్టుకొచ్చారు. బడా చోరులను పట్టుకోవడం తలకుమించిన పనైతే చిల్లర దొంగలను పట్టుకోవడం చిన్న లాజిక్ ఉపయోగించాలి. తాజాగా, హైదరాబాద్‌లో ఇలాంటి చిల్లర దొంగలే అడ్డంగా పట్టుబడ్డారు.

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో గత కొంతకాలంగా తెల్లవారుజామున పాల పాకెట్లు మాయమవుతున్నాయి. ఓ పాల వ్యాపారికి చెందిన దుకాణంలో బుట్టల్లో డీలర్లు పాల పాకెట్లు వేసి వెళతారు. అయితే తెల్లవారుజామున అమ్ముకోవడానికి వచ్చేసరికే కొన్ని పాలప్యాకెట్లు మాయమై ఉండేవి. దీనిపై డీలర్లను అడిగితే తాము సరిగ్గానే ప్యాకెట్లు వేస్తున్నామని బదులిచ్చారు. దీంతో మరి పాల ప్యాకెట్లు ఏమవుతున్నాయో అర్థంకాని పరిస్థితి. ఇలా, ఒకటి రెండ్రోజు కాదు నెలలుగా ఇలాగే జరుగుతుండటంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుకాణం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక ఎప్పటి మాదిరిగానే ఉదయాన్నే భార్యాభర్తలు కళ్లు నులుముకుంటూ వచ్చి చేతి వాటం ప్రదర్శించారు. అంతే ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. భార్యాభర్తలిద్దరూ ఏదో తమ సొంత ఆస్తి మాదిరిగా దర్జాగా పాల ప్యాకెట్లు చోరీ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. అంతే కిలాడీ భార్యాభర్తలను సనత్‌నగర్ పోలీసులు మాటువేసి అదుపులోకి తీసుకున్నారు.కొత్త తరహా దొంగలు.. పాల ప్యాకెట్లు చోరీ చేస్తున్న కిలాడీ భార్యాభర్తలు

Tags:    

Similar News