బాహుబలి సీన్ రిపీట్.. చిన్నారిని పైకెత్తి వాగు దాటిన వ్యక్తి
Komaram Bheem District: ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కొడుకును చేతులతో పైకెత్తి వాగులో దిగిన తండ్రి
బాహుబలి సీన్ రిపీట్.. చిన్నారిని పైకెత్తి వాగు దాటిన వ్యక్తి
Komaram Bheem District: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్‌ని తలపించేలా తల్లిందండ్రులు సాహసం చేశారు. లక్మాపూర్‌లో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏడాది చిన్నారికి 2 రోజులుగా తీవ్రజ్వరం రావడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక దిక్కుతోచని పరిస్థితిలో చేసేదేమీలేక.. కొడుకును చేతులతో పైకెత్తి తండ్రి వాగుదాటి అవతలికి తీసుకెళ్లాడు. ఒకరినొకరు పట్టుకుని ఏడాది పసివాడితో వాగు దాటాడు.