రైతులని ఆదుకునేందుకు ఫాం టూ హోం సేవలు : ప్రజల ఇంటి చెంతకే తాజా పళ్ళు

Update: 2020-04-15 12:05 GMT
Farm to Home organisation members collecting fruits from farmers

తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వాక్ ఫర్ వాటర్ స్వచ్చంద సంస్థ ఇంటివద్దకే పండ్లు, కూరగాయల కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే 10 వేల 625 కుటుంబాలకు పండ్లను సరఫరా చేయగా మరో 13 ,435 ఆర్డర్లు పెండింగులోవున్నట్లు తెలిపారు వాక్ ఫర్ వాటర్ ఫౌండర్ కరుణాకర్ రెడ్డి. ప్రస్తుతం సరాసరి ఒకరోజు 3000 కు పైగా ఆర్డర్లు వస్తున్నాయని , ఆర్డర్ల సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఆయన తెలిపారు. 24 గంటల ఆర్డర్ బుకింగ్ కొరకు ఆటోమేటిక్ కాల్ సెంటరును ప్రారంభించామని , ఆర్డర్ ఇవ్వవలసిన వారు 8875351555 నెంబరుకు missed call ఇస్తే వారి మొబైల్ నెంబరుకు ఆర్డర్ ఫార్మ్ వస్తుందని వాక్ ఫర్ వాటర్ స్వచ్చంద సంస్థ తెలిపింది. దానికి పూర్తి చేయడము వల్ల వారి ఆర్డర్ నమోదుచేసుకోవడము జరుగుతుందని, సప్లై కూడా అదే క్రమములో జరుగుతుంది అని సంస్థ నిర్వాహకులు కరుణాకర్ రెడ్డి తెలిపారు .

కల్లోల కరోనాతో దేశం లాక్‌డౌన్‌ అయి ఉద్యాన తోటల్లో పంటలు పాడైపోతూ రైతులు నష్టపోతున్న వేళ అన్నదాతలకి మార్కెటింగ్ ఊరట కల్పించేందుకు వాక్‌ ఫర్ వాటర్‌ సంస్థ ముందుకొచ్చింది. సీ2K రైతు ఉత్పత్తిదారుల సంఘంతో కలసి పాత ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ ,మహబూబ్ నగర్ జిల్లాల రైతుల నుంచి తాజా పండ్లు సేకరించి... జంటనగరాలైన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లలో సరఫరా చేసేందుకు ఫాం టూ హోం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వాక్ ఫర్ వాటర్ స్వచ్చంద సంస్థ ప్రారంభించిన విషయం తెలిసిందే.

కల్లోల కరోనాకి కళ్లెం రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే. వైద్యుల సూచనలతోపాటు ఏ, సీ విటమిన్లు దొరికే తాజా పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌ సోకకుండా ఎదుర్కోవచ్చు. కాబట్టి సహజ పండ్లతో ఆరోగ్యం పొందుదాం - ఇంట్లోనే ఉండి కరోనాని నిలువరిద్దాం అనే నినాదంతో ముందుకు వెలుతున్నామని సంస్థ తెలిపింది.

నలుగురు సభ్యులు కలిగిన కుటుంబానికి వారానికి సరిపోయే మామిడి, బొప్పాయి, పుచ్చ, బత్తాయి, సపోట, నిమ్మ తదితర పండ్లని పాకేజీ రూపంలో అందిస్తోంది. కనీసం 30 పాక్‌లు తీసుకునే గ్రూపులు, అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీ సంఘాలకి ఉచితంగా డెలివరీ చేయనుంది.

డెలివరీ చేసే పండ్లు: మామిడి(1.5 కేజీ), బొప్పాయి‍ ‍(3 కేజీలు), నిమ్మ(12కాయలు), పుచ్చ(3-4 కేజీలు), బత్తాయి(2.5 కేజీలు), సపోట(1 కేజీ)

కనీస ఆర్డర్‌: 30 పాకింగ్‌లు

పాక్‌ ధర: రూ. 300/-

పండ్లు, కూరగాయలు సేకరించే జిల్లాలు: పాత ఖమ్మం, నల్గొండ, వరంగల్‌

పండ్లు, కూరగాయలు సరఫరా చేసే ప్రాంతాలు: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి

సూచన: పండ్ల అందుబాటునిబట్టి రకం, పరిమాణంలో మార్పులు ఉంటాయి

వివరాలకు: ఎం. కరుణాకర్‌ రెడ్డి, ఫోను/వాట్సాప్‌ 98494 33311

Tags:    

Similar News