Arvind Dharmapuri: మీరే మా బలం.. ఎన్నికల ప్రణాళికలో బీజేపీ కార్యకర్తలు భాగస్వాములు కావాలి
Arvind Dharmapuri: ప్రపంచంలోనే ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ఏకైక పార్టీ బీజేపీ
Arvind Dharmapuri: మీరే మా బలం.. ఎన్నికల ప్రణాళికలో బీజేపీ కార్యకర్తలు భాగస్వాములు కావాలి
Arvind Dharmapuri: ఎన్నికల ప్రణాళికలో బీజేపీ కార్యకర్తలు భాగస్వాములు కావాలని.. ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన మేనిఫెస్టో రూపకల్పనకు విద్యావంతులు, మేధావులు ఇచ్చే సూచనలు ఎంతగానో సహకరిస్తాయన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని.. మోడీ పాలన దేశానికి దిక్సూచి లాంటిదన్నారు. అవినీతి రహితంగా ఏ విధంగా అందించాలో నేర్పిన పార్టీ బీజేపీ అని... ఇవాళ ప్రపంచమంతా మోడీ వైపు చూస్తుందన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైనవని తెలిపారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోపై అభిప్రాయ సేకరణ సమావేశం జరిగింది. విద్యావంతులు, మేధావులతో కలిసి ఎంపీ అర్వింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.