మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు!

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేశారు. 2020 మార్చి 21వ తేదీ నుంచి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Update: 2019-12-01 02:33 GMT

బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియెట్ రెండు రోజుల క్రితం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. మార్చి 4 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలను, 5 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రారంభించేలా షెడ్యూలును (టైంటేబుల్‌) బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ప్రకటించారు.

ఇదే నేపధ్యంలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేశారు. 2020 మార్చి 21వ తేదీ నుంచి పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలకు సంబంధించిన అన్ని విధాల కసరత్తును ముమ్మరం చేసారు. ప్రతీ ఏడాది ఇంటర్మీడియేట్ పరీక్షలు ముగియడానికి రెండ్రోజుల ముందు పదో తరగతి పరీక్షలు ప్రారంభిస్తున్నారు.

అదే తరహాలో ఈ సారి కూడా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. వారం రోజుల లోపే పదోతరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మార్చి21 నుంచి పరీక్షలు నిర్వహించాలనే అంశంపై విద్యాశా‌ఖ అధికారులు చర్చించారు.



Tags:    

Similar News