Jagtial: కరోనాను జయించిన 10 నెలల చిన్నారి

Jagtial: గత నెల తల్లి రాధికకు, చిన్నారి ఆరాధ్యకు కరోనా పాజిటివ్

Update: 2021-05-20 09:12 GMT

Representational Image

Jagtial: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో పది నెలల చిన్నారి కరోనాను జయించింది. వర్షకొండ గ్రామానికి చెందిన వేముల ఆనంద్‌, రాధిక దంపతులకు పది నెలల కుమార్తె ఆరాధ్య ఉంది. గత నెల తల్లి రాధికకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ క్రమంలోనే చిన్నారి ఆరాధ్యకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల సూచనలతో తల్లిదండ్రులు తీసుకున్న జాగ్రత్తలు, వైద్యాధికారుల కృషితో చిన్నారి కరోనాను జయించి క్షేమంగా ఇంటికి చేరుకుంది. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News