సినీ కార్మికులకు మంత్రి తలసాని సాయం...

Update: 2020-05-26 09:42 GMT
Talasani Srinivas Yadav (File Photo)

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలు నుండ షూటింగ్స్ లేక సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో వారిని ఆడుకోవటం కోసం సినీ పరిశ్రమలోని పెద్దలు, నటీ నటులు సినీ కార్మికులకు వారికి తోచిన సాయాన్ని చేస్తున్నారు. అయితే ఉపాధి లేక సతమతమవుతున్న వారి తీర్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే 'కరోనా క్రైసిస్‌ ఛారిటీ' (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. ఈ చారిటీ ద్వారా విరాళాలు సేకరించి, సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణి చేసారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కూడా తన వంతు ప్రయత్నంగా 14 వేల సినీ, టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని మంత్రి ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం గురువారం మొదలుకొని 14 వేల మంది సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలు అందే వరకూ కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు.  


Tags:    

Similar News