పింఛన్ల పంపిణీపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఇక నుంచి వారికి మాత్రమే..
తెలంగాణలో చేయూత పెన్షన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పింఛన్ల పంపిణీపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఇక నుంచి వారికి మాత్రమే..
తెలంగాణలో చేయూత పెన్షన్ పంపిణీని పూర్తిగా పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క కీలక చర్యలు చేపట్టారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య వ్యాఖ్యలు చేశారు.
అర్హులకే పెన్షన్ – ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి
మంత్రి సీతక్క అధికారులు ఫేషియల్ రికగ్నిషన్ వంటి అధునాతన సాంకేతిక పద్ధతులు వినియోగించి, నిజమైన లబ్ధిదారులకే పెన్షన్ చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాంకేతిక కారణాలతో పంపిణీ ఆలస్యమైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వేలిముద్రల సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరమని ఆమె పేర్కొన్నారు.
మహిళా సాధికారతపై దృష్టి
ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని సీతక్క స్పష్టం చేశారు. 15 ఏళ్ల వయసు నుంచే మహిళా సంఘాలలో సభ్యత్వం కల్పిస్తున్నామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా క్యాంటీన్లు, ప్రమాద బీమా ద్వారా పేద కుటుంబాలకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు.
ఫ్రీ బస్సు పథకం – మహిళలకు ఆత్మవిశ్వాసం
"మహిళలు కేవలం ఫ్రీ బస్సు ఎక్కేవారే కాదు, వారిని బస్సు ఓనర్లుగా మార్చింది మా ప్రభుత్వం" అని సీతక్క వ్యాఖ్యానించారు. ఈ పథకం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పారు.
వృద్ధుల సంక్షేమంపై ప్రాధాన్యం
"పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న చేయూత పెన్షనే వారి ధైర్యం" అని సీతక్క స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదరికం తగ్గకపోతే సమాజంలో అంతరాలు పెరుగుతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.