TG Inter Results: నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
TG Inter Results 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి.
నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
TG Inter Results 2025
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను మధ్యాహ్నం 12గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఈ ఫలితాలను www.tgbie.cgg.ov.in ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసే విధానం:
ముందుగా అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.ఇన్లేదా results.cgg.gov.in లోకి వెళ్లాలి.
“TS Inter Results 2025” లింక్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత, పరీక్ష సంవత్సరం, స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్), హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి, “Get Memo” బటన్‌పై క్లిక్ చేయాలి.
ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శితమవుతుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.