ఆర్టీసీ సమ్మెపై విచారణ వచ్చే గురువారానికి వాయిదా

Update: 2019-11-01 11:24 GMT

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఆర్ధిక స్థితిగతులపై ఆర్టీసీ అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టులో ఆర్టీసీ తన వాదనను వినిపించింది. ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక సమర్పించాలని ఇన్‌చార్జ్‌ ఎండీని హైకోర్టు ఆదేశించింది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపుగా నివేదికలో ఎలా పేర్కొంటారని కోర్టు నిలదీసింది. ఉద్దేశ్యపూర్వకంగా వాస్తవాలు దాచి నివేదికలు ఇచ్చారని తప్పుపట్టింది. కోర్టుకు ఇలాగేనా నివేదికలు సమర్పించేది అంటూ ఆర్టీసీ ఎండీపై హైకోర్టు మండిపడింది.  

Tags:    

Similar News