తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

Update: 2019-07-08 09:16 GMT

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు ఉత్తర్వులు వెల్లడించే వరకు సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలు కూల్చవద్దన్న హైకోర్టు కోర్టు ఆదేశించింది. ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం స్పష్టం చేసింది. కౌంటర్‌కు ప్రభుత్వ తరపు లాయర్ 15 రోజులు గడువు కోరారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలను కోర్టు తోసిపుచ్చింది. నేడే వాదనలు వింటామని హైకోర్టు కోర్టు స్పష్టం చేసింది. దీంతో నేటి మధ్యాహ్నం వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ లాయర్ వెల్లడించారు. దీంతో విచారణ మధ్యాహ్నానికి కోర్టు వాయిదా పడి మళ్లీ మొదలైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. సచివాలయ భవనం, ఎర్రమంజిల్ కోర్టు కూల్చివేతలపై పాడి మల్లయ్య అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Tags:    

Similar News