Telangana: ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనపై టీఎస్ సర్కార్ సీరియస్
Telangana: క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana: ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనపై టీఎస్ సర్కార్ సీరియస్
Telangana: ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై టీఎస్ సర్కార్ క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. రంగారెడ్డి DMHO స్వరాజ్యలక్ష్మీ, DCHS ఝాన్సీలక్ష్మీపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ జోయల్ సునీల్‌కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. బాధ్యులపై చర్యలతో పాటు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ.