ఆదివాసీ గర్భిణి మృతి.. గవర్నర్ సీరియస్, విచారణకు ఆదేశం

Update: 2020-06-22 11:00 GMT
Tamilisai Soundararajan (File Photo)

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆదివాసీ గర్భిణి మృతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణి మృతిపై అధికారులు వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ఈ క్రమంలోనే జిల్లా వైద్యాధికారులు గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో గర్భిణి మృతిపై విచారణ జరుపుతున్నారు. నిండుగర్భిణిగా ఉన్న జయశీల పురుటికోసం రిమ్స్‌ ఆస్పత్రిలో చేరగా జూన్ 19వ తేదీన ఆమెతో పాటు కడుపులో ఉన్న కవలలతో పాటు ఆమె కూడా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిండు గర్భిణి మృతిలో ఆదివాసీ సంఘాలు వైద్యులపై నిప్పులు చెరిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని గర్భిణి చనిపోయిందని ఆరోపించాయి.

గర్భిణి మరణానికి కారణమైన వైద్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అంతే కాదు ఈ విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై దృష్టికి కూడా తీసుకువచ్చారు. దీంతో స్పందించిన గవర్నర్ వెంటనే ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని విచారణకు ఆదేశించారు. ఇక పోతే గతంలోకూడా ఇలాంటి సంఘటను అక్కడక్కడా జరిగిన దాఖలాలు ఉన్నాయి. గతంలో గద్వాలకు చెందిన ఓ గర్భిణి కూడా ప్రసవం కోసం ఆరు హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరికి ఆమె బాబుకు జన్మనిచ్చి ప్రాణాలను కోల్పోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే ఆ చిన్నారికూడా చనిపోయాడు.


Tags:    

Similar News