డోర్‌ డెలివరీ కంపెనీల ద్వారా పాలు సరఫరా : పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బాధితుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది కానీ తగ్గడంలేదు.

Update: 2020-03-29 04:53 GMT

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బాధితుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది కానీ తగ్గడంలేదు. ఇప్పటి వరకు నమోదయిన కేసులలో కొన్ని విదేశాల నుంచి వచ్చినవి ఉండగా మరికొన్ని ఒకరినుంచి మరోకరికి సోకిన కేసులు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో కేసుల సంఖ్య 67కి చేరింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది. ఇందులో భాగంగానే ప్రజలు బయటికి వెల్లకుండా లాక్ డౌన్ ప్రకటించింది. ఇలా ఒక దాని తరువాత ఒకటి కరోనా వైరస్ కట్టడికి వీలయ్యే పనులు చేపట్టినప్పటికీ కరోనా మాత్రం ఇంకా విజృంభిస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ భవనంలో వివిధ డెయిరీల ప్రతినిధులతో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు ఇంట్లో తప్పక వాడుకునే పాలను ఇకపై స్విగ్గీ, బిగ్‌ బాస్కెట్‌ వంటి డోర్‌ డెలివరీ కంపెనీల ద్వారా సరఫరా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో కొంతమంది అధికారులు ప్రస్తుతం ఆయా డోర్ డెలివరీ సంస్థలతో మాట్లాడుతున్నారని స్పష్టం చేసారు. ఈ చర్చలు సఫలం అయితే త్వరలోనే పాలు ఇళ్లకే వచ్చేస్తాయి. ప్రజలు బయటికి వెల్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

ఇక ఇంటికి వచ్చిన పాల ప్యాకెట్లపై కరోనా వైరస్ ఉందని అనుమానం వస్తే ఆ ప్యాకెట్లను హ్యాండ్ శానిటైజర్ రాసుకున్న చేతులతో పట్టుకోవాలని అప్పుడు ఏ సమస్యా ఉండదని తెలిపారు. డోర్ డెలివనీ చేసేటప్పుడు పాల ధరలను పెంచకుండా MRP దరలకే అమ్మాలని ఎవరైనా ధరలు పెంచి అమ్మితే వారిపై PD యాక్ట్ (బెయిల్ ఉండదు) కింద చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి తెలిపారు. పాలు సప్లై కాకపోతే ప్రజలు వెంటనే 040-23450624కు కంట్రోల్‌ రూంకు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వమన్నారు.

అనంతరం విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు HMDAలో లాక్‌డౌన్‌ అమలు చేయడానికి ముందు ప్రతి రోజూ 30 లక్షల లీటర్ల పాలు సప్లై అయ్యేవని తెలిపారు. కానీ ఇప్పుడు పాలు సప్లై చేసే సిబ్బంది రాకపోవడంతో సైప్లై 27 లక్షలకు తగ్గాయనీ ఆయన తెలిపారు. ఈ విధంగా పాలు డోర్ డెలివరీ చేస్తే పాల సప్లై మల్లీ పెరుగుతుందని ఆయన అన్నారు. ఇలా చేస్తే ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు.

Tags:    

Similar News