Telangana: టీచర్లకు శుభవార్త – పదోన్నతుల షెడ్యూల్ విడుదల, 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి
తెలంగాణ రాష్ట్రంలో టీచర్లకు మంచి వార్త తెలిపింది ప్రభుత్వం. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, పీఈటీలు, లాంగ్వేజ్ పండితులకు పదోన్నతుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
Telangana: టీచర్లకు శుభవార్త – పదోన్నతుల షెడ్యూల్ విడుదల, 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి
తెలంగాణ రాష్ట్రంలో టీచర్లకు మంచి వార్త తెలిపింది ప్రభుత్వం. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, పీఈటీలు, లాంగ్వేజ్ పండితులకు పదోన్నతుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేశారు. ఆగస్టు 2 నుండి ప్రారంభమై, ఆగస్టు 11లోగా మొత్తం ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రక్రియలో మొత్తం 3,900 మంది టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. ఇందులో 900 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా, స్కూల్ అసిస్టెంట్లను గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు ఇస్తారు. మల్టీజోన్-1లో 492, మల్టీజోన్-2లో 411 హెచ్‌ఎం పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా, 641 ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉండడంతో, వాటిని ఎస్జీటీల ద్వారా భర్తీ చేయనున్నారు.
పదోన్నతుల వల్ల ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను తిరిగి ఎస్జీటీలతో భర్తీ చేస్తారు. పీఈటీలు, లాంగ్వేజ్ పండితులకు కూడా ఈ సారి ప్రమోషన్ అవకాశాలు ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం విద్యాశాఖను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటున్నారు. ఆయన విద్యావ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయాలను తీసుకుంటున్నారు. పలు పాఠశాలల్లో రెగ్యులర్ హెచ్‌ఎంలు లేకపోవడం వల్ల నెలకొన్న సమస్యలు తొలగించేందుకు ఈ ప్రక్రియ కీలకంగా మారనుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దీని ద్వారా పాఠశాలల్లో పరిపాలన మెరుగుపడే అవకాశం ఉంది.