ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి : హరీశ్‌రావు

మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట మున్సిపల్‌ సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు సానిటైజర్లను పంపిణీ చేశారు.

Update: 2020-04-27 08:10 GMT
Harish Rao Awareness Programme at Shankarampet

మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట మున్సిపల్‌ సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు సానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచే మున్సిపల్ సిబ్బంధి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సానిటైజర్లను పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని అన్ని పరిస్థితులను ఎదుర్కొనే విధంగా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి బయటకు వెళ్లాలన్నారు. సామాజిక దూరం పాటించాలని, పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. కరోనా వైరస్ నుంచి బయట పడాలంటే... రోజుకు మూడు సార్లు వేడి నీళ్లు తాగాలని చెప్పారు. ప్రతి ఒక్కరు ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, ముఖ్యంగా కోడి గుడ్లు, పాలు వంటి ఆహారం తీసుకోవాలన్నారు. అదే విధంగా పుల్లని పండ్లను అంటే నిమ్మ, సంత్రా, బత్తాయి వంటి పండ్లు తీసుకోవాలన్నారు. పారిశుధ్య పనులు పట్టణాల్లో, పంచాయతీల్లో ఆగకూడదని ప్రభుత్వం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కింద నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. మనల్ని మనం కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకోవాలని అన్నారు.


Tags:    

Similar News