కొవిడ్ ఆస్పత్రికి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు

కరోనా వైరస్‌ను కట్టడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.

Update: 2020-04-29 15:04 GMT
Revanth Reddy (File Photo)

కరోనా వైరస్‌ను కట్టడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. కరోనా పై పోరుకు తన వంతు సాయం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ముందుకు వచ్చారు. కరోనాను తరిమికొట్టేందుకు తక్షణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను 1500 పడకల కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ హాస్పిటల్‌కు రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షల ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు రూ.50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి కలెక్టర్‌కు అందజేశారు. ప్రభుత్వం కరోనా బాధితుల చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తే తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు ఇస్తానని ఎంపీ రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

గచ్చిబౌలిలో కరోనా బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆస్పత్రిని నిర్మించినా.. దానికి సరిగ్గా మురుగునీటి పారుదల కల్పించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. దీంతో మురుగు నీరంతా పక్కనే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలోకి వెళ్తోందని అన్నారు. దీంతో ఆ విషయాన్ని గమనించిన అక్కడి విద్యార్థులు, సిబ్బంది ఈ సమస్యను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. వారం రోజుల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.




Tags:    

Similar News