కరెంటు చార్జీలు పెంచుతాము, దాపరికం లేదు..

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయా అంటే అవుననే చెప్పుకోవాలి. శుక్రవారం జరిగిన శాసనసభలో కేసీఆర్ విద్యుత్ చార్జీల పెంపుపై స్పష్టతను ఇచ్చారు.

Update: 2020-03-13 08:36 GMT
KCR Speech in Assembly

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయా అంటే అవుననే చెప్పుకోవాలి. శుక్రవారం జరిగిన శాసనసభలో కేసీఆర్ విద్యుత్ చార్జీల పెంపుపై స్పష్టతను ఇచ్చారు. ఈ విషయంలో కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేసారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచుతామని స్వయంగా సీఎం కేసీఆర్ తెలిపారు. దళితులకు, గిరిజనులకు విద్యుత్ చార్జీల పెంపునుంచి మినహాయింపు ఇస్తామని ఆయన తెలిపారు. వారికి 101 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.

ఎవరికైతే పేయింగ్ కెపాసిటీ ఉంటుందో వారికి మాత్రమే పెంచుతామని తెలిపారు. పెంచకపోతే వ్యవస్థ నడవదని తెలిపారు. జీతం పెరగాలి, క్వాలిటీ పెరగాలి, 24గంటల పాటు విద్యుత్ ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా విద్యుత్ చార్జీలు పెంచుతామని తెలిపారు. మంచి ప్రజా ప్రతినిధులు, మంచి పాలకులు ఉంటే వాస్తవాలను ప్రజలకు తెలపాలి అని అన్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో కూడా టాక్స్ పెంచుతామని ఆయన అన్నారు.

ప్రజలు తమంతట తాము సెల్ప్ డిక్లరేషన్తో ఇల్లు ఎంత స్ధలాన్ని ఆక్రమించి ఉందో అందుకు అనుగుణంగా ఇంటి పన్నును చెల్లించాలని తెలిపారు. ఎవరైనా అవాస్తవం చెప్పినట్లయితే వారికి 25 టైమ్స్ జరిమానా విధిస్తామని తెలిపారు. దాంతొ పాటు 2ఏండ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. 60, 70 ఏండ్ల నుంచి పన్నులు ఎవరికి ఎవరు పన్నులు కట్టడం లేదని గ్రామాలన్నీ పెంటకుప్పలయిపోయాయని తెలిపారు. కోట్లలో అవినీతి జరుగుతుందన్నారు. పనులు జరగడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసి పాలకులను తిడుతున్నారన్నారు. ఎందుకు ప్రజాప్రతినిధులు నిందలకు గురి కావాలని ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్దికే పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. 500 జనాభా ఉన్న పంచాయతీలకు ఐదేళ్లలో రూ.40నిధులు కేటాయించామని తెలిపారు. జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీలకు కూడా నిధులు కేటాయించామన్నారు. గిరిజనులు సెంటిమెంట్లను గౌరవిస్తామన్నారు. అనంతరం రైతుల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినా ప్రజలు వారిని నమ్మలేదన్నారు.  


Full View


Tags:    

Similar News