BJP: నేడు తెలంగాణ బీజేపీ ఎన్నికల సమరశంఖం.. ప్రచార రథాలకు పూజ చేయనున్న కిషన్‌రెడ్డి

BJP: నేడు ప్రచార రథాలకు పూజ చేయనున్న కిషన్‌రెడ్డి

Update: 2024-02-19 02:40 GMT

BJP: నేడు తెలంగాణ బీజేపీ ఎన్నికల సమరశంఖం.. ప్రచార రథాలకు పూజ చేయనున్న కిషన్‌రెడ్డి

BJP: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి ప్రచార రథాలకు పూజలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి టి.బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఐదు క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రలకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాత్రలోఅసోం, గోవా సీఎంలతో పాటు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా ఇతర బీజేపీ నేతలు పాల్గొనునున్నారు. 4వేల 238 కిలోమీటర్ల మేర బీజేపీ రథయాత్రలు సాగనున్నాయి. యాత్రల ముగింపు సభకు మోడీ హాజరవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News