Tamilisai Soundararajan: సీఎంరీలీఫ్ ఫండ్ కు గవర్నర్‌ ఒక నెల జీతం విరాళం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే 195 దేశాలకి ఈ వ్యాధి సోకింది.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

Update: 2020-03-29 05:24 GMT
Tamilisai soundararajan

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే 195 దేశాలకి ఈ వ్యాధి సోకింది.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇప్పటికే 195 దేశాలకి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధి వలన భారత్‌లో 724 కరోనా కేసులు నమోదు కాగా, 17 మంది మృతి చెందారు.. దీనిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వెళ్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లక్షా డెబ్బై వేల కోట్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించారు. ఇక ప్రభుత్వాలతో పాటుగానే సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు తమకు చేతనైనంత విరాళం అంజేశారు. వారితో పాటుగానే సామాన్య రైతులు, చిన్న ఉద్యోగులు కూడా వారి స్థోమతలో వారు విరాళాలు అందజేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ఒక నెల జీతాన్ని అంటే రూ.3.50 లక్షలను కరోనాపై పోరుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జగదీశ్వర్‌కు ఆమె రాజ్‌భవన్‌లో చెక్కు ను అందజేశారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలందరికి మద్దతు ఇస్తున్నట్లు ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అంతకు ముందు గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. కరోనా ప్రభావంతో తెలంగాణలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉందని వారికి ఆహారం, వసతి సదుపాయం కల్పించాలని సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి ఐసీఎంఆర్‌ అనుమతి పొందిన ప్రైవేటు ఆస్పత్రులను బలోపేతం చేయాలని ఆమె కోరారు.

Tags:    

Similar News