Hyderabad: ఆ ఒక్కటీ అడకకండి : ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ

ఆర్టీసీ యూనియన్ ఎన్నికలను రెండేళ్ల వరకు నిర్వహించమని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ తేల్చిచెప్పేసారు.

Update: 2020-01-22 03:03 GMT
ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ

హైదరాబాద్ నగరంలోని బస్‌భవన్‌లో మంగళవారం కరీంనగర్‌ జోన్‌ పరిధిలోని డిపో మేనేజర్లు, అకౌంట్స్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ‍యన మాట్లాడుతూ ఆర్టీసీ ఎన్నికల విషయంలో ఒక స్పష్టతని తీసుకొచ్చారు. ఆర్టీసీ యూనియన్ ఎన్నికలను రెండేళ్ల వరకు నిర్వహించమని తేల్చిచెప్పేసారు. కొందరు డిపో మేనేజర్లు, సంక్షేమ మండళ్ల సభ్యులు తమకు విధులు లేకుండా రిలీఫ్‌లు కేటాయించాలని కోరుతున్న విషయాన్ని ప్రస్తావించారు. కానీ నూతనంగా ఏర్పడిన మండళ్ల సభ్యులకు రిలీఫ్‌లు కేటాయించకూడదని ఆర్టీసీ ఎండీ సునీల్‌శ స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 200 మందిని మించి సభ్యులున్నందున, వారికి రిలీఫ్‌లు ఇస్తే సంస్థపై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంక్షేమ మండళ్లు అందుబాటులోకి వచ్చి నెలరోజులు గడిచాయని మండళ్ల నిర్వహణలో ఉన్న ఇబ్బందులు తెలుసుకుని సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. దాంతోపాటుగానే మండళ్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించేందుకు శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నేపథ‌్యంలోనే ఆర్టీసీ ఉద్యోగులకు ఏమైనా సమస్యలు తలెత్తితే ఆ సమస్యలను విధినిర్వహణతో పాటుగానే పరిష్కరించాలని తెలిపారు. రోజు కాసేపు మాత్రమే సిబ్బంది సమస్యలపై దృష్టి సారిస్తే సరిపోతుందని, ఇందుకు పెద్దగా సమయం పట్టనందున ప్రత్యేకంగా రిలీఫ్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.  



Tags:    

Similar News