తెలంగాణలో కరోనా పరీక్షల తీరుపై హైకోర్టు అసంతృప్తి

తెలంగాణలో కరోనా వైర‌స్ టెస్టుల‌ తీరుపై ఆ రాష్ట్ర‌ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Update: 2020-05-08 13:59 GMT

తెలంగాణలో కరోనా వైర‌స్ టెస్టుల‌ తీరుపై ఆ రాష్ట్ర‌ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలు మృత‌దేహాల‌కు ఎందుకు చేయడం లేదని ఉన్న‌త న్యాయ‌స్థానం ప్రశ్నించింది. అనుమానిత ల‌క్ష్య‌నాలు ఉన్న‌వారికే కరోనా పరీక్షలు చేయాలని ఎందుకు నిర్ణయించారో చెప్పాల‌ని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. కోవిడ్ 19 లక్షణాలు ఉన్న వారికే పరీక్ష చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ‌ మార్గదర్శకాల్లో ఎక్కడుందని న్యాయ‌స్థానం ప్రశ్నించింది. రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మందికి క‌రోనా టెస్టులు ఎందుకు చేయడం లేదో తెలపాలని హైకోర్టు ప్రశ్నించింది. గణాంకాలతో గజిబిజి చేస్తే కరోనా వ్యాప్తిపై పూర్తి స్థాయిలో వాస్త‌వాలు ఎలా తెసుస్థాయ‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈనెల 14కి తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

మ‌రోవైపు రాష్ట్రంలో క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డలేద‌నేది అవాస్త‌వ‌మ‌ని మంత్రి ఈటల రాజేంద్ర స్ప‌ష్టంచేశారు. కోవిడ్ ప‌రీక్ష‌లు వీలైంత ఎక్కువ‌మందికి నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. గ‌త 24 గంట‌ల్లో తెలంగాణ‌లో 10 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. ఇవాళ 34 మంది కోలుకొని డిశార్జ్ అయ్యారు. రాష్ట్రంలో క‌రానా బారినుంచి 720 మంది కోలుకుని డిశార్జ్ కాగా...గాంధీ ఆసుప‌త్రిలో 376 మంది చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల‌తో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ రాష్ట్రంలో 1,132 చేరింది.  

Tags:    

Similar News