శ్రీరామనవమి ఉత్సవాలు ప్లాస్టిక్ రహితంగా జరిపించాలి

శ్రీరామనవమి ఉత్సవాలు ప్లాస్టిక్ రహితంగా జరిపించాలి ...జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవస్థానం ఈవో జీ నరసింహులు గారికి వినతి పత్రం సమర్పణ.

Update: 2020-02-29 12:53 GMT
ఈవో జీ.నరసింహులు, చలపతిరావు, కడాలి నాగరాజు, శ్రీమతి కమల రాజశేఖర్

దేశంలోకెల్లా అతి పెద్ద గిరిజన పండుగ మేడారం జాతరను ఎలాగైతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున ప్లాస్టిక్ రహితంగా జరిపించారో, దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలంలో కూడా ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలను ఈ సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహితంగా జరిపించాలని కోరుతూ జేడీ ఫౌండేషన్ భద్రాచలం శ్రీ మురళీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో దేవస్థానం ఈవోని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా EO మాట్లాడుతూ జేడీ ఫౌండేషన్ వారి సేవలను తప్పనిసరిగా ఉపయోగించుకుని ఈ సంవత్సరం నుండి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహితంగా  శ్రీరామనవమి ఉత్సవాలు జరపడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చలపతిరావు, కడాలి నాగరాజు వికాస తరంగిణి సభ్యురాలు శ్రీమతి కమల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు .

Tags:    

Similar News