Janata Curfew: ప్రయాణికుల సౌకర్యార్ధం 12 ఎంఎంటీఎస్‌ రైళ్లు..

కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా అన్నింటిపై పడుతుంది.

Update: 2020-03-21 09:38 GMT
MMTS Train (File Photo)

కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా అన్నింటిపై పడుతుంది. కరోనా వైరస్ సోకి ఇప్పటి వరకూ వేల సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోగా, లక్షల్లో అనారోగ్యం పాలయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 100దేశాలకు పైగా ఈ వైరస్ విస్తరించింది. ఈ నేపథ్యంలోనే దేశ ప్రధాని నరేంద్రమోదీ 22వ తేది ఆదివారం రోజున జనతా కర్ఫ్యూని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం దేశం అంతా ఎక్కడికక్కడ స్థంబించి పోనుంది. రైల్లు, బస్సుల, విమానాలు, బంకులు, దుకాణాలు ఇలా అన్ని మూసివేయనున్నారు. కాగా దక్షిణ మధ్య రైల్వే మాత్రం ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెల్లే ప్రయాణికుల కోసం 12 ఎంఎంటీఎస్‌ రైళ్లను మాత్రమే నడపనున్నట్లు సీపీఆర్వో రాకేశ్‌ ప్రకటించారు. ఇకపోతే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి దూరం ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 లోపు బయలు దేరే 250కి పైగా ప్యాసింజర్‌, మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు అయ్యాయి. రైల్వేస్టేషన్లలో ఉండే షాపులన్నింటిని మూసివేస్తున్నారు.


Tags:    

Similar News