ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్స్: ఎన్ జీ ఆర్ ఐ మార్కింగ్ ప్లేస్‌లో బయటపడ్డ ఐరన్ పైపులు

SLBC Tunnel Collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.

Update: 2025-03-03 07:42 GMT

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్స్: ఎన్ జీ ఆర్ ఐ మార్కింగ్ ప్లేస్‌లో బయటపడ్డ ఐరన్ పైపులు

SLBC Tunnel Collapse

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. పది రోజులుగా మూడు షిప్టుల వారీగా 150 మంది గాలిస్తున్నారు.టన్నెల్‌లో ఆరు ప్రాంతాల్లో ఎన్ ‌జీఆర్ఐ టీమ్ మార్కింగ్ నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో రెస్క్యూసిబ్బంది తవ్వకాలు జరుపుతున్నారు. ఎన్ జీ ఆర్ఐ అధికారులు చేసిన మార్కింగ్ ప్లేస్ లో ఒక్క ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఐరన్ పైపులు బయటపడ్డాయి. దీంతో మిగిలిన ఐదు చోట్ల రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. టన్నెల్ లో తవ్వకాలు జరుపుతున్న సమయంలో భూమి నుంచి నీరు ఉబికి వస్తోంది. ఇది రెస్క్యూ ఆపరేషన్స్ కు ఇబ్బంది కలిగిస్తోంది. ఎస్‌ఎల్ బీ సీ టన్నెల్ లో బురద తొలగింపు మార్చి 3వ తేదీ రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉంది. మరో వైపు టన్నెల్ లో కన్వేయర్ బెల్ట్ కు రిపేర్స్ ఇవాళ పూర్తయ్యే అవకాశం ఉంది.

మరో వైపు టన్నెల్ లో ఎండ్ పాయింట్ వద్ద తవ్వకాలు చేయాలనే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. అలా చేస్తే మరోసారి టన్నెల్ కూలిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై ఏం చేయాలనే దానిపై అధికారులు ఇవాళ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఎస్ఎల్ బీ సీ టన్నెల్ లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ ను తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి మార్చి 2న పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్స్ లో అవసరమైతే రోబో సేవలను వినియోగిస్తామని ఆయన అన్నారు.

టన్నెల్ నిర్మాణ పనుల్లో టీబీఎం ముందు వైపు ఉన్న ఎనిమిది మంది ఈ ప్రమాదంలో టన్నెల్ లో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో టీబీఎం మెషీన్ వెనుక వైపు ఉన్న 42 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటకు వచ్చారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఈ ఎనిమిది మంది కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. కానీ, ఇంతవరకు వారి ఆచూకీ దొరకలేదు.

Tags:    

Similar News