కరోనా టీకా తయారీలో తెలంగాణ ఔషధ కంపెనీలు..

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించి వణికిస్తుంది.

Update: 2020-04-22 06:49 GMT
Representational Image

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించి వణికిస్తుంది. ఈ వైరస్ సోకి లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ వైరస్ ను రూపు మాపేందుకు వ్యాక్సిన్ రూపకల్పన కోసం చైనా, అమెరికా, ఇజ్రాయెల్, క్యూబా దేశ శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు. అదే విధంగా మన భారత దేశం శాస్త్రవేత్తలు కూడా వాక్సిన్ ను కనిపెట్టే ప్రయత్నంలో ముందు వరసలోనే ఉన్నారని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు. అతి తక్కువ ధరలకే భారత్ వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రపంచం నుంచి కరోనాను శాశ్వతంగా తరిమికొట్టాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆకాంక్షించారు. 'భారత్ ఇప్పటికే టీకాల తయారీలో ప్రపంచ స్థాయి కేంద్రంగా (గ్లోబల్ వ్యాక్సిన్ హబ్) ఉందని ఆయన తెలిపారు.

ఈ విషయాన్ని అమితాబ్ కాంత్ తన ట్విటర్ లో ట్వీట్ చేయడంతో ఆ ట్వీట్ కి కేటీఆర్ స్పందించారు. ఆరు ఔషధ కంపెనీలు భారత్ నుంచి కరోనా వ్యాక్సిన్ ని తయారీ చేయడానికి ముందుకు రావడం, అందులో మూడు కంపెనీలు తెలంగాణకి చెందినవి కావడం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రపంచానిక ఉపయోగపడే ఔషధాలలో మూడో వంతు ఔషధాలు తెలంగాణ లోని హైదరాబాద్లోని కంపెనీలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు.






Tags:    

Similar News