Bandi Sanjay: గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు
Bandi Sanjay: ఇప్పటికే 10లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి
Bandi Sanjay: గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు
Bandi Sanjay: తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటికే 10లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. ఇంకా లక్షలాది కుటుంబాలు దరఖాస్తు చేసుకునేందుకు వేచిచూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.