Raj Bhavan: తెలంగాణలో సంచలనం..రాజ్ భవన్ లో చోరీ
Raj Bhavan: తెలంగాణ రాజ్ భవన్ లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. అందులోని సుధర్మ భవన్ లోని నాలుగు హార్డ్ డిస్కులు చోరీ అయినట్లు రాజ్ భవన్ అధికారులు గుర్తించారు. ఈనెల 13వ తేదీన చోరీ ఘటన చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీసులకు రాజ్ భవన్ అధికారులు కంప్లెయింట్ ఇచ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కంప్యూటర్ హార్డ్ వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్ కు తరలించారు.
రాజ్ భవన్ కు సంబంధించి మొత్తం వ్యవహారంతోపాటు కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఆ హార్డ్ డిస్కుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 14వ తేదీ అర్థరాత్రి హెల్మెట్ ధరించి కంప్యూటర్ గదిలోకి వెళ్లింది ఎవరు..ఇంటి దొంగల పనా లేదా మరేవరైన చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడిందని గుర్తించి అరెస్ట్ చేశారు. అతన్ని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు.