యథాతథంగా ఆర్టసీ సమ్మె : అశ్వత్థామ రెడ్డి

Update: 2019-11-23 12:08 GMT
అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ కార్మికులు వారి సమ్మెను విరమించి ఎలాంటి శరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే బాహాటంగా చేరతామని మూడు రోజుల క్రితం జేఏసీ నాయకులు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వం  స్పందించక  పోవడంతో  డిపో మేనేజర్లు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంలేదు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ సరైన నిర్ణయమే తీసుకుంటారని అ‌శ్వత్థామరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ రోజున హైదరాబాద్ ఎంజీబీఎస్ లో అన్ని కార్మిక సంఘాలతో జేఏసీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి 5100 రూట్లను ప్రయివేటు పరం చేసే అధికారం ఎవరికీ లేదంటూ ఆయన స్ఫష్టం చేశారు.

రూట్లు ప్రయివేటు కావడం పట్ల కార్మికులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని వారు ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం కార్మికుల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి అనంతరం జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. రేపటి నుంచి సమ్మె మళ్లీ యధాతథంగా కొనసాగుతుందని జేఏసీ నాయకులు తెలిపారు. ఎంజీబీఎస్ బస్టాండులో రేపు ఉదయం మహిళా ఉద్యోగులు తమ నిరసనను చేపడతారని వెల్లడించారు. అయితే కొంత మంది కార్మికులు మాత్రం సమ్మె కొనసాగింపుపై వ్యతిరేకతను చూపుతున్నారు.



Tags:    

Similar News