MLA Rohit Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి తప్పిన ప్రమాదం.. టైరు పేలడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
MLA Rohit Reddy: స్వల్పగాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
MLA Rohit Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి తప్పిన ప్రమాదం.. టైరు పేలడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
MLA Rohit Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో ఆ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపిలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంగళూరు నుంచి శృంగేరి వెళ్తున్నారు.
ఈ క్రమంలో కారు ఉడిపి జిల్లా కర్కల తాలూకాలోని మియారు బ్రిడ్జి సమీపంలోని నల్లూరు క్రాస్ ముడారు ప్రాంతంలోకి చేరుకోగానే టైరు పేలింది. దీంతో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనపై స్థానిక కర్కల పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డారు.