Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
Revanth Reddy: ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. రైతుల కష్టాన్ని మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ లో రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించినట్టు తెలిపారు. ఇప్పటికే నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.