Revanth Reddy: బీసీలకు అండగా మా పార్టీ నిలిచింది
Revanth Reddy: బీసీ జన గణనకు కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది
Revanth Reddy: బీసీలకు అండగా మా పార్టీ నిలిచింది
Revanth Reddy: బీసీ జనగణనతోనే.. ఆ వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, ఆ దిశగా బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్నాయని, న్యాయంగా తమకు దక్కాల్సిన వాటా కోసం ఆయా సామాజికవర్గాలు చేస్తున్న బీసీ జనగణన డిమాండ్‌కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని, ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతి నిరసన, ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని అన్నారు టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... ఈ మేరకు సీఎం చంద్రశేఖర్ రావుకు రేవంత్ బహిరంగ లేఖ రాశారు.
మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన సమయంలో కూడా తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారని, కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఇండియా కూటమిలోని భాగస్వాములైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన నితీశ్ కుమార్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం బీహార్‌లో బీసీ జనగణనను విజయవంతంగా చేపట్టిందని, ఆ వివరాలను నిన్న విడుదల కూడా చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు.