SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో డెడ్‌బాడీ ఆనవాళ్లు గుర్తింపు?

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో మరో మృతదేహం ఆనవాళ్లు రెస్క్యూ సిబ్బంది గుర్తించినట్టు సమాచారం.

Update: 2025-03-25 05:22 GMT

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో డెడ్‌బాడీ ఆనవాళ్లు గుర్తింపు?

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో మరో మృతదేహం ఆనవాళ్లు రెస్క్యూ సిబ్బంది గుర్తించినట్టు సమాచారం. అయితే ఇది మృతదేహం అవునో కాదో అనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు మంగళవారం టన్నెల్ లోకి వెళ్లారు. టన్నెల్‌లో లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు గుర్తించారు.

ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తుండడంతో ఇది మానవ మృతదేహంగా అనుమానిస్తున్నారు. క్యాడవర్ డాగ్స్‌తో పాటు ఇతర ఆధునాతన టెక్నాలజీ సహాయంతో గుర్తించిన ప్రదేశం కాకుండా మరో ప్రదేశంలో మృతదేహం ఆనవాళ్లు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాలను డీ1, డీ2 గా గుర్తించారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 42 మంది కార్మికులు సురక్షితంగా తప్పించుకున్నారు. మరో ఎనిమిది టన్నెల్‌లోనే చిక్కుకున్నారు. ఎనిమిది మందిలో టీబీఎం ఆపరేటర్ మృతదేహన్ని ఇటీవల వెలికి తీశారు.

ఎస్ఎల్‌బీసీలో సహాయకచర్యలపై సీఎం రేవంత్ రెడ్డి మార్చి 24న సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. సహాయక చర్యలకు టన్నెల్ లో పరిస్థితులు ఏ రకంగా ఆటకం కలిగిస్తున్నాయో కూడా వివరించారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న విషయాన్ని అధికారులు సీఎంకు తెలిపారు. సహాయక చర్యలను కొనసాగించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News