Lock Down: బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవు : రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం తలపెట్టిన లాక్ డౌన్ సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు.

Update: 2020-03-28 14:50 GMT
Rachakonda commissioner Mahesh Bhagavat (File Photo)

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం తలపెట్టిన లాక్ డౌన్ సందర్భంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ కమిషనరెట్ పరిధిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటున్నకూలీలు ఎక్కడికి వెళ్లకూడదని ఆయన సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ రంగాలు, మార్బుల్స్‌ షాపులు, ఇటుక బట్టీలు మూత పడ్డాయని ఆ కంపెనీలలో పనిచేస్తున్న కూలీలకు ప్రస్తుతం పని లేదని వారి తెలిపారు. దీంతో వారందరూ వారి వారి సొంత ఊళ్లకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారన్నారు. కానీ ఎవరూ కూడా వారి ఊళ్లకు ప్రయాణం చేయకూడదని కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడే ఉండాలన్నారు. వారికి వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇక కొంత మంది గృహ నిర్మాణంలో పని చేసే ఉన్నారని, వారికి వారి బిల్డర్స్‌ అసోషియేషన్‌ వాళ్లే వసతి, భోజన సదుపాయం కల్పించేట్లు చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే వారు రాచకొండ కంట్రోల్‌ రూం నెంబర్‌ 9490617234 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. లాక్ డౌన్ సమయంలో చాలా మంది బయటికి వస్తున్నారని, అలా వచ్చిన వారిపై కఠిన చర్యలు తసుకుంటామని ఆయన తెలిపారు. బయటికి వచ్చిన వారిపై సెక్షన్‌ 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


Tags:    

Similar News