Madhira: మున్సిపల్ కమిషనర్ పై మంత్రి ఆగ్రహం

మధిరలో పట్టణ ప్రగతి లో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన సందర్భంగా ఆత్మకూరు అడ్డరోడ్డు వద్ద టిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

Update: 2020-03-02 11:11 GMT
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మధిర: మధిరలో పట్టణ ప్రగతి లో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన సందర్భంగా ఆత్మకూరు అడ్డరోడ్డు వద్ద టిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి తొమ్మిదో మున్సిపాలిటీ వార్డ్ సుందరయ్య నగర్ లో పార్క్ ను ప్రారంభించారు. రెండో వార్డులో కొబ్బరి మొక్క నాటి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ...మంత్రి మధిర మున్సిపాలిటీలో కాలువలు అధ్వానంగా ఉన్నాయని రోడ్ల వెంట ప్లాస్టిక్ సంచులు కనిపిస్తున్నాయి అంటూ మధిర మున్సిపల్ కమిషనర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పట్టణంలో పందుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏ కార్యక్రమం లో నైనా ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని ఎనిమిది నెలల్లో 85 శాతం మొక్కలు పెంచకపోతే కౌన్సిలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. సభలో మంత్రి అజయ్ ను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలతమ, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


Tags:    

Similar News