హైదరాబాద్‌లో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన

Update: 2019-12-17 05:02 GMT
ప్రతీకాత్మక చిత్రం

పౌరసత్వ (సవరణ) బిల్లుకు రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు 125 మంది ఎంపీ అనుకూలంగా ఓట్లు వేయగా, 105మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. దీంతో ఈ బిల్లును అమలు చేసారు.

ఇదిలా ఉంటే బిల్లు అమలు అయిన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనల హోరు సాగుతుంది. ఇదే కోణంలో హైదరాబాద్‌లోనూ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు యూనివర్శిటీల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుండి స్టేడియం వరకు విద్యార్థులు మార్చ్‌ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు గచ్చిబౌలి స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.





Tags:    

Similar News