Etela Rajender: పార్టీ మార్పుపై ఈటల రాజేందర్‌ మీద పెరుగుతున్న ఒత్తిడి..?

Etela Rajender: ఈటల పార్టీ మార్పుపై జోరందుకున్న వదంతులు, బెట్టింగులు..!

Update: 2023-06-23 07:43 GMT

Etela Rajender: పార్టీ మార్పుపై ఈటల రాజేందర్‌ మీద పెరుగుతున్న ఒత్తిడి..?

Etela Rajender: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ... కర్నాటక ఎన్నికల్లో విజయం తర్వాత దూకుడు పెంచింది. తెలంగాణలో పలువురు ముఖ్య నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో బీజేపీలోని కీలక నేతలు కాంగ్రెస్‌ గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా బీజేపీకి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పార్టీ మారాలంటూ ఆయనపై కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. హుజురాబాద్‌లో ఈటలతో తన ముఖ్య అనుచరులు నిన్న సమావేశమై... పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ వైపు వెళితేనే బాగుంటుందంటూ ఈటలకు ఆయన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సూచించినట్టు చెబుతున్నారు. ఇదే సమయంలో తాను పార్టీ మారడం లేదంటూ మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ స్పష్టంగా ప్రకటించారు. మరోవైపు బీజేపీ అధిష్టానం కూడా ఈటల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయినా.. ఈటల పార్టీ మార్పుపై వదంతులు ఆగడం లేదు సరకాదా.. దీనిపై పెద్దఎత్తున బెట్టింగులు జరుగుతున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News