Telangana: ఆ రాత్రి ఏం జరిగింది..? - ప్రీతి తండ్రి
Telangana: ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యే- ప్రీతి తండ్రి
Telangana: ఆ రాత్రి ఏం జరిగింది..? - ప్రీతి తండ్రి
Jangaon: నేడు మెడికో ప్రీతికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రీతి మరణించడంతో ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ప్రీతి భౌతికదేహం వద్ద తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. స్వగ్రామం జనగామ జిల్లా మొండ్రాయి గిర్ని తండాలో ఆమె అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనుండడంతో ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో గిర్నితండా, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల బందోబస్తు మధ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రీతి ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రీతి తండ్రి నరేంద్ర చెబుతున్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రీతి తండ్రి నరేంద్ర డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది..? ముందు రోజు కంప్లయింట్ చేశానని.. అయితే HOD సరైన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కన్నీటిపర్యంతమవుతున్నాడు. నిందితుడు మా పాపను కక్ష కట్టి చంపేసి ఉంటాడని, ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యే అని ప్రీతి తండ్రి ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలను తారుమారు చేసు ప్రయత్నం జరుగుతుందన్న ప్రీతి తండ్రి.. HOD ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి.. ఆదివారం రాత్రి మృతిచెందింది. అయితే నిమ్స్‌లో అర్ధరాత్రి వరకు పరస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌తో పాటు HODని సస్పెండ్ చేసిన తర్వాతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఎలా చనిపోయిందో సమగ్ర నివేదిక కావాలని తండ్రి నరేంద్ర కోరారు. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. అక్కడ పోస్టుమార్టం పూర్తవడంతో వైద్యులు ప్రీతి భౌతికకాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ పోలీస్ కాన్వాయ్‌తో ప్రీతి డెడ్‌బాడీని జనగామ జిల్లా మొండ్రాయిలోని గిర్ని తండాకు తరలించారు. ఆమె మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.