మేడ్చల్‌ జిల్లాలో భారీగా గంజాయి సీజ్‌

Medchal: రూ.12 లక్షలు విలువచేసే 42 కిలోల గంజాయి స్వాధీనం

Update: 2023-12-17 01:43 GMT

మేడ్చల్‌ జిల్లాలో భారీగా గంజాయి సీజ్‌

Medchal: మేడ్చల్‌ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పీఎస్‌ పరిధి చర్లపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకువచ్చి.. నగరంలో విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 లక్షలు విలువచేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకువచ్చి.. చర్లపల్లి ఇండస్ట్రియల్‌ ఏరియాతో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు.

Tags:    

Similar News