దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో ఎన్హెచ్ఆర్సీకి పోలీసులు ఆధారాలు సమర్పించారు. దిశపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు సాక్ష్యాలను అందించారు. ఫోరెన్సిక్ ఆధారాలతో ఎన్హెచ్ఆర్సీకి సైబరాబాద్ పోలీసులు నివేదిక ఇచ్చారు. దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్య, కాల్చివేతకు సంబంధించి ఆధారాలతో సహా నివేదిక, శాస్త్రీయ ఆధారాలను ఎన్హెచ్ఆర్సీ ముందు పెట్టారు పోలీసులు. ఘటనా స్థలంతో పాటుగా లారీ తిరిగిన సీసీ ఫుటేజీని కూడా పోలీసులు ఎన్హెచ్ఆర్సీకి అందించారు.
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మావన హక్కుల కమిషన్ 4వ రోజు విచారణ కొనసాగిస్తోంది. ఇవాళ పోలీస్ అధికారులను ఎన్హెచ్ఆర్సీ బృందం విచారించనుంది. అయితే ఇప్పటికే ఎన్కౌంటర్ సమయంలో గాయపడ్డ పోలీసులను కమిషన్ సభ్యులు విచారించారు. కాసేపట్లో చటాన్‌పల్లిలో ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి సిట్ బృందం వెళ్లనుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించనున్నారు.