ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు..కోర్టు ఆదేశాలు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది.ఆయనతో పాటు ఎంఐఎం మాజీ ఎమ్మెల్యేపైన కూడా కేసులు నమోదయ్యాయి.

Update: 2020-03-13 10:02 GMT
Asaduddin Owaisi (file Photo)

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది.ఆయనతో పాటు ఎంఐఎం మాజీ ఎమ్మెల్యేపైన కూడా కేసులు నమోదయ్యాయి. గతేడాది కేంద్రం అమలు చేసిన ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో ఓ బహిరంగ సభ నిర్వహించారు. కశ్మీర్, భారత్, పాకిస్థాన్ తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అంతే కాకుండా ఓ వర్గం గురించి అసదుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు ఒక వర్గానికి చెందిన వారిని రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇక్విలాబ్‌ మిలత్‌ పార్టీ నేత బల కిషన్‌రావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన కోర్టు అసద్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో హైదరాబాద్ మొగల్‌పుర పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసారని వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అసద్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 153, 153 (a) 117 295-a, 120b సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Tags:    

Similar News